బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి నియామకం

NLR: బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన నాసిన భాస్కర్ గౌడ్ నియమితులయ్యారు. ఆయనకు నియామక పత్రం అందజేయబడింది. ఈ సందర్భంగా భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ.. బీఎస్పీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.