శానిటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
RR: చేవెళ్ల మున్సిపాలిటీ 15, 16వ వార్డుల్లో 'ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య శానిటేషన్ పనుల్లో పాల్గొన్నారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్న ఆయన, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.