రామవరంలో స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్
E.G: మహిళల ఆరోగ్య పరిరక్షణకు స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి అన్నారు. అనపర్తి మండలం రామవరంలో పీహెచ్సీ వద్ద నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి బుధవారం ప్రారంభించారు. అనంతరం నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కోసం పార్టీ శ్రేణులకు పంచారు.