జాగృతి జిల్లా కార్యదర్శిగా ప్రతాప్ రెడ్డి
కామారెడ్డి జిల్లా తెలంగాణ జాగృతి కార్యదర్శిగా లింగంపేట మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన ప్రతాప్ రెడ్డి నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షురాలు కవిత ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టినట్లు జిల్లా అధ్యక్షుడు సంపత్ గౌడ్ తెలిపారు. ప్రతాప్ రెడ్డి కవితను కలవగా, ఆమె కండువా కప్పి అభినందించారు. తనపై నమ్మకంతో అప్పగించిన పదవికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని పేర్కొన్నారు.