కడప ఉల్లి రైతులకు న్యాయం చేసిన ఎమ్మెల్యే
KDP: కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి కడప జిల్లా ఉల్లి రైతుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించారు. సరైన ధరలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి అచ్చం నాయుడు గార్లను ఒప్పించి, కర్నూలు రైతులకు అందించిన విధంగానే కడప రైతులకు కూడా న్యాయం చేయించారు. రైతుల కార్యవర్గం ఆయన చర్యలను అభినందిస్తోంది.