ఎరువుల దుకాణాల తనిఖీ

SRPT: తుంగతుర్తి మండల కేంద్రంలో మన గ్రోమోర్ తో పాటు పలు ఎరువుల దుకాణాలను గురువారం తహసీల్దార్ దయానందం, ఎస్సై క్రాంతికుమార్, ఏవో బాలకృష్ణలు ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా కొరత లేకుండా చూడాలని దుకాణ యజమానులను ఆదేశించారు. స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. యూరియాను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.