'ఆమండలాలను కడప జిల్లాలోనే కొనసాగించాలి'
KDP: సిద్దవటంలోని భాకరాపేటలో గురువారం రెండో రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. 'రాయచోటి మాకు వద్దు కడప మాకు ముద్దు' అంటూ ప్రజలు నినాదాలు చేశారు. రాయచోటికి 100 కి.మీ ప్రయాణం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని దీక్షకారులు పేర్కొన్నారు. సిద్ధవటం కోట, ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవస్థానం వంటి పుణ్యక్షేత్రాలు కడప జిల్లాలోనే కొనసాగాలని వారు డిమాండ్ చేశారు.