రాయితీ ధరపై మామిడి కవర్లు పంపిణీ

రాయితీ ధరపై మామిడి కవర్లు పంపిణీ

CTR: రాయితీ ధరతో ప్రభుత్వం అందజేసిన మామిడి కవర్లను రైతులకు పంపిణీ చేసినట్లు చౌడేపల్లె హార్టికల్చర్ ఆఫీసర్ సంతోషికుమారి గురువారం తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో వీటిని పంపిణీ చేసినట్టు ఆమె వెల్లడించారు. ప్రభుత్వ రాయితీ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లీలావతి పాల్గొన్నారు.