రేపు మండలంలో పర్యటించనున్న ఎస్టీ కమిషన్ ఛైర్మన్

PPM: సాలూరు మండలం నార్లవలస పంచాయతీ గిరి శిఖర గ్రామం మారయ్యపాడులో బుధవారం రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ డివిజి శంకరరావు పర్యటించనున్నారు. ఈ మేరకు మంగళవారం ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కార్యాలయం సిబ్బంది ఒక ప్రకటనలో తెలిపారు. మరయ్యపాడు గిరిజనులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకుంటారని, అనంతరం పాలికవలస గ్రామంలో పర్యటిస్తారని తెలిపారు.