'గండిపడ్డ చెరువుకు మరమ్మతులు చేపట్టండి'

'గండిపడ్డ చెరువుకు మరమ్మతులు చేపట్టండి'

JGL: కథలాపూర్(M) దుంపేట గ్రామంలోని చెరువుకు గండి పడడంతో సుమారు 80 ఎకరాల పంటకు నష్టం జరిగిందని బీజేపీ బీజేపీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఇవాళ పలు నాయకులు గండి పడ్డ చెరువును పరిశీలించారు. అనంతరం నీటిపారుదలశాఖ ఇంజనీర్, తహసీల్దార్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల్యాల మారుతి, వెంకటేశ్వరరావు, లింగం, భూమయ్య పాల్గొన్నారు.