చంద్రబాబు రాజకీయాలన్నీ హోటల్స్‌లో జరుగుతాయి: YCP
AP: చంద్రబాబు రాజకీయాలన్నీ హోటల్స్‌లో రహస్యంగా జరుగుతాయని.. అక్కడే పైరవీలు, ప్రలోభాలన్నీ చేయిస్తుంటారని YCP అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ విమర్శించారు. నెల్లూరు కార్పొరేషన్ వ్యవహారాన్ని కూడా పుదుచ్చేరిలోని ఓ హోటల్‌కు చేర్చారని, కొందరు పోలీసులు BNS చట్టాన్ని అంటే 'బాబు అన్యాయ సంహిత'గా మార్చారని దుయ్యబట్టారు. అధికార బలం అన్నివేళలా పనిచేయదని పేర్కొన్నారు.