శ్రీరంగాపురంలో నేడు రంగనాథుని కళ్యాణం
WNP: శ్రీరంగాపురంలోని శ్రీరంగనాథ స్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం జరగనుంది. రేవతి నక్షత్రం సందర్భంగా ఉదయం స్వామి, అమ్మవార్లకు అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించనున్నట్లు అర్చకులు విష్ణు నారాయణ బట్టర్ తెలిపారు. ఈ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. కళ్యాణం కోసం ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.