'ప్రతి ఇంటి నుంచి బీసీ బిడ్డ దీక్షలో భాగమవ్వాలి'

'ప్రతి ఇంటి నుంచి బీసీ బిడ్డ దీక్షలో భాగమవ్వాలి'

HYD: బీసీ రిజర్వేషన్ల కోసం ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిరాహర దీక్షకు దిగారు. ‘ఇది మన ఇంటి ఉద్యమం, ప్రతీ ఇంటి నుంచి ఒక్క బీసీ బిడ్డ దీక్షలో భాగమవ్వాలి’ అని ఆమె పిలుపునిచ్చారు. నీళ్లు తాగకుండా, అన్నం తినకుండా కొనసాగుతున్న దీక్షలో శాంతియుతంగా హక్కుల కోసం పోరాటం చేస్తామని తెలిపారు.