బేతంచెర్లలో 105 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ

బేతంచెర్లలో 105 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ

NDL: దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన నాయకుల త్యాగాన్ని మరవకూడదని పలువురు అన్నారు. గురువారం పట్టణం ప్రజలు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకుల ఆధ్వర్యంలో హర్ గర్ తిరంగా యాత్రలో భాగంగా జాతీయ జెండాతో కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ నాయకుల సేవలను పలువురు కొనియాడారు.