మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం
హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ విద్యార్థులకు మహిళా భద్రతపై వరంగల్ క్రైమ్ ACP సదయ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు ఒంటరిగా ప్రయాణించాల్సి వచ్చినపుడు T-SAFE యాప్ ఉపయోగించాలని, యాప్ గురించి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ CI సుజాత, కానిస్టేబుల్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.