గిరిజన పాఠశాలలో బాలల దినోత్సవం
SRD: మండల కేంద్రమైన కంగ్టిలో శుక్రవారం జవహర్ లాల్ నెహ్రూ జన్మదిన సందర్భంగా తెలంగాణ గిరిజన గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆర్ట్స్ ఉపాధ్యాయుడు దేవేందర్ విద్యార్థులచే నెహ్రూ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ విజయ్, ఉపాధ్యాయులు విద్యార్థులు ఉన్నారు.