బాలిక హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం

బాలిక హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం

మేడ్చల్: కూకట్ పల్లి బాలిక హత్యకేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. సహస్ర హత్య కేసులో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దర్యాప్తులో భాగంగా కిచెన్ లోని కత్తితోనే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వంటగదిలో 3 కత్తులు ఉండాల్సి ఉండగా.. ఒక కత్తి మాయమైనట్లు గుర్తించారు. కిచెన్‌లో చెల్లాచెదురుగా వస్తువులు పడిఉండడం అనుమానాలకు తావిస్తోంది.