ఆర్మూర్ బస్టాండ్​లో పోలీసుల తనిఖీలు

ఆర్మూర్ బస్టాండ్​లో పోలీసుల తనిఖీలు

NZB: మాదకద్రవ్యాలు, గంజాయి రవాణా నేపథ్యంలో ఆర్మూర్ పోలీసులు అలర్ట్​ అయ్యారు. ఈ మేరకు నగర ఆర్టీసీ బస్టాండ్​లో సోమవారం రాత్రి ఎస్​హెచ్​వో సత్యనారాయణ ఆధ్వర్యంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. బస్సులు, బస్టాండ్​లోని ప్రయాణికుల సామగ్రిని డాగ్​స్క్వాడ్​ సిబ్బంది తనిఖీలు చేశారు. బస్టాండ్​లో తిరుగుతున్న అనుమానిత వ్యక్తులను విచారించారు.