'అనుమతులు లేకుండా ప్లెక్సీలు ఏర్పాటు చేస్తే చర్యలు'
ప్రకాశం: మున్సిపల్ అనుమతులు లేకుండా పట్టణంలో ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగులు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ డీ.రవీంద్ర తెలిపారు. గురువారం మున్సిపల్ కార్యాలయం నందు కౌన్సిల్ సమావేశం జరిగింది. సమావేశంలో అభివృద్ధి పనులకు సంబంధించి అజెండాలో పొందుపరిచిన 40 అంశాలను ఆమోదించినట్లు ఛైర్‌పర్సన్ ఎస్తేరమ్మ తెలిపారు.