ములుగులో నేడు మంత్రి సీతక్క పర్యటన

MLG: ములుగు మండలంలో శనివారం మంత్రి సీతక్క పర్యటించనున్నట్లు కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల భరత్ కుమార్ ప్రకటనలో తెలిపారు. మండలంలోని జంగాలపల్లి, కొత్తూరు, సర్వాపురం, రాయినిగూడెం, కన్నాయి గూడెం గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని, పార్టీ నాయకులు, అధికారులు సకాలంలో హాజరు కావాలని సూచించారు.