రామగుండం కమిషనరేట్‌లో 68 గంజాయి కేసులు నమోదు

PDPL: 2025లో ఇప్పటి వరకు రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలో 68 గంజాయి కేసులు నమోదయ్యాయని సీపీ అంబర్ కిషోర్ తెలిపారు. ఈ కేసుల్లో 196 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరి నుంచి 191.643 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ గంజాయి విలువ రూ. 94,33,095 ఉంటుందని పేర్కొన్నారు.