ఎమ్మెల్యే పాయం వాహనాన్ని తనిఖీ చేసిన అధికారులు

ఎమ్మెల్యే పాయం వాహనాన్ని తనిఖీ చేసిన అధికారులు

భద్రాద్రి: పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వాహనాన్ని గురువారం పోలీసులు, ఎన్నికల అధికారులు ఏడూళ్ళ బయ్యారం చెక్‌‌పోస్ట్ వద్ద తనిఖీ చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి పినపాక మండలానికి తన వాహనంలో వెళుతుండగా ఎన్నికల అధికారులు వాహనం ఆపి తనిఖీ చేశారు. పోలీసుల విధులకు, ఎన్నికల డ్యూటీలో ఉన్న అధికారులకు ఎటువంటి ఆటంకం కలగకుండా సహకరించారు.