జగన్‌ది అమానవీయ మనస్తత్వం: TDP

జగన్‌ది అమానవీయ మనస్తత్వం: TDP

AP: కర్నూల్ బస్సు ప్రమాదం నేపథ్యంలో YCP చీఫ్ జగన్‌పై TDP విమర్శలు గుప్పించింది. ‘చనిపోయిన 19 మంది బూడిదలో జగన్ రాజకీయ ప్రయోజనాలు వెతికాడు. శవం కనిపిస్తే చాలు.. తన రాజకీయ ఎదుగుదలకు ఎలా వాడుకుందామా అని ఆలోచించే అమానవీయ మనస్తత్వం జగన్‌ది’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ ఘటనపై తప్పుడు ప్రచారం చేశాడంటూ మండిపడింది.