పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని వినతి

KMR: నాగిరెడ్డిపేట్ మండల గోపాల్‌పేట్ గ్రామంలోని కేరళ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని సోమవారం భారతీయ విద్యార్థి మోర్చ ఆధ్వర్యంలో కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీవీఎమ్ రాష్ట్ర కార్యదర్శి విఠల్ మాట్లాడుతూ.. పాఠశాలలోని విద్యార్థిపై దాడి చేసి వాతలు వచ్చే విధంగా కొట్టిన యజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.