మార్కాపురంలో కఠిన తనిఖీలు

మార్కాపురంలో కఠిన తనిఖీలు

ప్రకాశం: మార్కాపురం పట్టణంలో సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో కలిసి విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లలో తనిఖీ నిర్వహించారు.అసాంఘిక కార్యకలాపాలు, మత్తు పదార్థాలు, గంజాయి రవాణాను అరికట్టేందుకు ఈ తనిఖీలను చేపట్టామని సీఐ స్పష్టం చేశారు. ప్రయాణికుల సామాను, అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.