జండారం శివాలయంలో లక్ష బిల్వార్చన
SRD: జీవన జ్యోతిర్లింగాలయం 41వ మండల వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 4:30కు పంచామృతాభిషేకం, 5:30కు యజ్ఞం, 8:00కు లక్ష బిల్వార్చన, పుష్పాభిషేకం నిర్వహించినట్లు వేద పండితులు తెలిపారు. ఈ కార్యక్రమానికి మహిళా భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.