14,967 ఉద్యోగాలు.. ముగుస్తున్న గడువు
కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో దేశవ్యాప్తంగా 14,967 ఉపాధ్యాయ, బోధనేతర సిబ్బంది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు గడువు మరో రెండ్రోజుల్లో ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 4లోపు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు భారతదేశంలో ఎక్కడైనా, గ్రామీణ, పట్టణ, రెసిడెన్షియల్ క్యాంపస్‌లలో పని చేయాల్సి ఉంటుంది.