కోడి తెచ్చిన కోట్లాట.. ముగ్గురిపై కేసు..!

కోడి తెచ్చిన కోట్లాట.. ముగ్గురిపై కేసు..!

NGKL: కుటుంబ వివాదంతో ఒకరిపై దాడి చేసిన ఘటనలో ముగ్గురిపై కేసు నమోదైనట్లు ఎస్సై వెంకటేశ్వర్లు గౌడ్ తెలిపారు. లింగాలకు చెందిన మల్లికార్జున్ అనే వ్యక్తి ఇంట్లో కోడి చనిపోవడంతో దంపతుల మధ్య ఘర్షణ తలెత్తింది. భార్యను భర్త మందలించిన నేపథ్యంలో మల్లికార్జున్ మామ రత్నయ్య, వెంకటేశ్, శేఖర్ అతడిపై దాడి చేశారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.