'ఫైలేరియాపై అవగాహన కలిగి ఉండాలి'
కోనసీమ: ఫైలేరియా వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ స్వాతి సూచించారు. ఆమె పి. గన్నవరం మండలంలోని నరేంద్రపురం, రాజులపాలెం గ్రామాలలో ఫైలేరియా వ్యాధి బాధితులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఫైలేరియా కిట్లను అందజేశారు. అదే విధంగా ఫైలేరియా వ్యాధి నివారణ చర్యలు చేపట్టడంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు ఉన్నారు.