క్యాతన్ పల్లిలో రేపు 163 BNSS అమలు
MNCL: క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో శనివారం ఉదయం 6 గంటల నుంచి 163 BNSS అమలులో ఉంటుందని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా శుక్రవారం తెలిపారు. ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయన్నారు. ఈ సమయంలో నలుగురికి మించి గుంపులుగా చేరడం నిషిద్ధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.