VIDEO: 'రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రం'

KMM: కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని ఐక్య రైతు సంఘం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు అన్నారు. శనివారం చింతకాని మండలం నాగులవంచలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 25, 26 తేదీల్లో మహబూబ్ నగర్‌లో జరిగే ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. అనంతరం మహాసభ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.