రోడ్డుపై నిరసన తెలిపిన తల్లిదండ్రులు

CTR: పుంగనూరులో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. పాఠశాలల విలీనం పేరిట తమ గ్రామంలోని పాఠశాలను మరో చోటుకు తరలించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. దీని వల్ల విద్యార్థులు ఇబ్బందికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.