పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
KNR: నగరంలోని పలు 10వ తరగతి పరీక్ష కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మంగళవారం తనిఖీ చేశారు. ఈ మేరకు ఆమె విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరును స్వయంగా పరిశీలించారు. పరీక్షల నిర్వహణ, విద్యార్థుల హాజరు అంశాలపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. 10తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.