VIDEO: మేడారం జాతర కీర్తి కోసం సీఎం కృషి: మంత్రి

MLG: జిల్లా కేంద్రంలో ఆదివారం మంత్రి సీతక్క మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. సమ్మక్క-సారలమ్మ జాతర కీర్తిని విశ్వవ్యాప్తం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. కొందరు సొంత ప్రయోజనాల కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మేడారం మాస్టర్ ప్లాన్ డీపీఆర్ నమూనా మాత్రమేనని, అంతిమం కాదని స్పష్టం చేశారు.