VIDEO: రఫ్ఫాడించిన గుడివాడ ఎమ్మెల్యే

VIDEO: రఫ్ఫాడించిన గుడివాడ ఎమ్మెల్యే

కృష్ణా: విజయవాడలో జరుగుతున్న ఎమ్మెల్యేలు, మంత్రుల క్రీడా పోటీల్లో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సత్తా చాటారు. బుధవారం రాత్రి నిర్వహించిన క్రికెట్ మ్యాచ్‌లో తనదైన డిఫెన్స్, ఆకట్టుకునే హిట్టింగ్‌తో ప్రేక్షకులను అలరించారు. వికెట్ల మధ్య చురుగ్గా పరుగులు తీస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన ఆటతీరుకు ప్రేక్షకుల నుంచి హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి.