నారాయణపేట DCC అధ్యక్షుడు సొంతూరిలో షాక్

నారాయణపేట DCC అధ్యక్షుడు సొంతూరిలో షాక్

NRPT: నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి సొంత గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మరికల్ మండలంలోని తీలేరు గ్రామంలో గ్రామ సర్పంచ్‌గా బీఆర్ఎస్, బీజేపీ మిత్రపక్షాల అభ్యర్థి మురారి కాంగ్రెస్ అభ్యర్థి రాముపై 444 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మురారికి 1,288 ఓట్లు రాగా, రాముకు 844 ఓట్లు వచ్చాయి.