BRS నేతల అరెస్ట్‌లపై కేటీఆర్ ఆగ్రహం
MDK: BRS నేతల అరెస్ట్‌లపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూమిని కాపాడుకోవాలని పోరాడుతున్న రైతులకు బాసటగా నిలిచేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ పిరికిపంద చర్య అని విమర్శించారు. బెదిరింపులకు ఎవరూ భయపడేది లేదని, ప్రజల పక్షాన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. భూ సేకరణను తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.