ఆచార్య వెలమల సిమ్మన్నకు ఘన సత్కారం

ఆచార్య వెలమల సిమ్మన్నకు ఘన సత్కారం

VSP: ఆంధ్ర విశ్వ కళా పరిషత్‌లో ఆచార్య వెలమల సిమ్మన్నకు శుక్రవారం ఘన సత్కారం జరిగింది. భాషా శాస్త్రవేత్తగా, విమర్శకుడిగా, శతాధిక వ్యాస రచయితగా, వేలాది విద్యార్థులను తీర్చిదిద్దిన గురువుగా ఆయన భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయులని శాఖ అధ్యక్షుడు జర్రా అప్పారావు, నవ సాహితీ సంస్థ అధ్యక్షుడు సూర్యప్రకాశ్‌రావు కొనియాడారు.