చిల్లేపల్లి గంగమ్మ.. చాలా SPECIAL..!

చిల్లేపల్లి గంగమ్మ.. చాలా SPECIAL..!

సూర్యాపేట: నేరేడుచెర్ల మండలం చిల్లేపల్లి గ్రామంలో మూసీ నదీ తీరాన వెలసిన గంగమ్మ తల్లి భక్తుల ఆరాధ్య దైవం. సంతాన ప్రాప్తి కోసం మహిళలు ఇక్కడ విశేషంగా మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే ప్రతి ఏటా జరిగే జాతరలో 'గంగ తెప్ప' ఊరేగింపు ఇక్కడ ప్రధాన ఆకర్షణ. యాదవుల కులదైవంగా, పాడిపంటల రక్షకురాలిగా అమ్మవారు ప్రత్యేక పూజలందుకోవడం విశేషం.