'కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి'
KMM: జిల్లాలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని AIRTWF యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు అంబేద్కర్ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో పత్రాలను దహనం చేశారు. ఈ క్రమంలో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కార్మికులకు అనువైన చోట అడ్డాలు ఏర్పాటు చేయాలని, 2019 రవాణా చట్టం రద్దు చేయాలని వారు కోరారు.