VIDEO: పావురం కష్టం చూడండి..!

VIDEO: పావురం కష్టం చూడండి..!

NLR: జిల్లాలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలో భానుడి భగభగలకు పైవీడియోనే నిదర్శనం. మనుషులతో పాటు మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. ఏఎస్.పేట మండలం హసనాపురం గ్రామంలో నీటి కుళాయిపై ఓ పావురం కూర్చుని ఒక్కో నీటి బొట్టును తాగుతూ దాహాన్ని తీర్చుకుంది. ఆ పక్షి అవస్థలు ఎండల తీవ్రతకు అద్దం పడుతోంది.