అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

GDWL: గద్వాల పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద ఓ వ్యక్తి మృతదేహం లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. ఆదివారం ఉదయం దీనిని గమనించిన వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.