శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు

తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. స్వామివారి సర్వదర్శనానికి కంపార్టుమెంట్లు నిండి శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 70,606 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,415 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.39 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.