VIDEO: బస్టాండ్‌లో మరుగుదొడ్లు మూసివేత.. తీవ్ర అసౌకర్యం

VIDEO: బస్టాండ్‌లో మరుగుదొడ్లు మూసివేత.. తీవ్ర అసౌకర్యం

KMR: దోమకొండ ఆర్టీసీ బస్టాండ్లో మరుగుదొడ్లకు తాళం వేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ బస్టాండ్‌పై ఆధారపడగా, టాయిలెట్లు మూతపడటంతో మహిళలు, వృద్ధులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. తక్షణమే మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు. అలాగే బస్టాండ్లో తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు.