పందుల దొంగతనాలను అరికట్టండి: ఎరుకల సూర్య

KRNL: ఆదోని డీఎస్పీ హేమలతను నేషనల్ ఫెడరేషన్ రాయలసీమ రీజనల్ ఇన్‌ఛార్జి మోపిరి సూర్య ఎరుకుల మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిశారు. అనంతరం ఆదోని డివిజన్‌లో ఎరుకుల కుటుంబాలు ఎదురుకుంటున్న పలు సమస్యలపై డీఎస్పీకి వివరించారు. వారు మాట్లాడుతూ.. పందుల పెంపకంతో జీవనం సాగిస్తున్నామని చెప్పారు. ఇటీవల జరుగుతున్న పందుల దొంగతనాలను అరికట్టాలని ఆమెను కోరారు.