గాయపడిన పారిశుద్ధ్య కార్మికులకు ఆర్థిక సహాయం

గాయపడిన పారిశుద్ధ్య  కార్మికులకు ఆర్థిక సహాయం

నెల్లూరు: బుచ్చి నగర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ఈ మేరకు నగర ఛైర్‌పర్సన్ మోర్ల సుప్రజ మురళి, నగర కమిషనర్ బాలకృష్ణ, వైస్ ఛైర్మన్ శివకుమార్ రెడ్డి, కౌన్సిలర్ రాచూరి సత్యం గాయపడిన దసయ్య, యాదగిరిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. నగర పంచాయతీ తరపున వారికి చెరో రూ. 25,000 చొప్పున ఆర్థిక సహాయం అందించారు.