40 లీటర్ల నాటు సారా స్వాధీనం

CTR: పుంగనూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గురువారం దాడులు నిర్వహించినట్లు ఎక్సైజ్ సీఐ సురేష్ రెడ్డి తెలిపారు. మండలంలోని పూజ గాని పల్లి సమీపాన అక్రమంగా నాటుసార రవాణా చేస్తుండగా.. నల్లగుట్లపల్లి తండాకు చెందిన శ్రీనివాసులు నాయక్ పరారీ అయ్యాడు. అనంతరం 40లీటర్ల సారాను, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసినట్లు సీఐ తెలిపారు.