ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ
కృష్ణా: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న “కోటి సంతకాలు” కార్యక్రమంలో భాగంగా ఉయ్యూరు 8వ వార్డులో వైసీపీ శ్రేణులు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ప్రైవేటీకరణ వల్ల పేద విద్యార్థులకు నష్టం జరుగుతుందని వైసీపీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.