చెత్త సేకరణ ట్రాక్టర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

చెత్త సేకరణ ట్రాక్టర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

E.G: జిల్లాలోని ప్రత్తిపాడు మండలంలో పెదశంకర్లపూడి గ్రామ పంచాయతీకి 'స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర' కార్యక్రమంలో భాగంగా ఒక కొత్త ట్రాక్టర్ మంజూరైంది. బుధవారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఈ ట్రాక్టర్‌ను జెండా ఊపి ప్రారంభించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. గ్రామానికి కొత్త ట్రాక్టర్ రావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.