సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమం
KDP: వీరపునాయునిపల్లి SI మంజునాథ్ ఆధ్వర్యంలో ఉరుటూరు గ్రామంలో 'పల్లె నిద్ర' కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్థులతో సమావేశమై సైబర్ మోసాలు, నేరాల తీరును వివరించి, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డిజిటల్ అరెస్టు, డ్రగ్స్ కేసుల పేరుతో వచ్చే మోసపూరిత కాల్స్‌ను నమ్మవద్దని, అటువంటి కాల్స్ వస్తే వెంటనే డయల్ 112 లేదా 1930కు సమాచారం అందించాలని తెలిపారు.